- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mardaani-3: షూటింగ్ సెట్‌లోకి స్టార్ హీరోయిన్.. యూనిఫాంలో ఎంట్రీ ఇచ్చిన లేడీ సింగం
అభిరాజ్ మినావాలా (Abhiraj Minawala), గోపీ పుత్రన్ (Gopi Putran) సంయుక్తంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘మర్దానీ-3’

దిశ, సినిమా: అభిరాజ్ మినావాలా (Abhiraj Minawala), గోపీ పుత్రన్ (Gopi Putran) సంయుక్తంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘మర్దానీ-3’ (Mardaani-3). ఇది ‘మర్దానీ’ ఫ్రాంచైజీ యొక్క చీకటి, ఘోరమైన అండ్ క్రూరమైన అధ్యాయంలో మూడొవ భాగంగా రాబోతుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ‘మర్దానీ-3’ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం నెటిజన్లు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాగంగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ‘మర్దానీ-3’లో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ (Rani Mukerji) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. తాజాగా ఆమె షూటింగ్ సెట్(Shooting set)లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ స్టార్ట్ కాగా.. రాణీ ముఖర్జీ సెట్‌లోకి యూనిఫాంతో ఎంట్రీ ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ 2026లో థియేటర్లలోకి రానుంది.






