Preity Zinta: నకిలీ వార్తలు ప్రచారం చెయ్యడం అవమానకరం.. కాంగ్రెస్ పార్టీపై స్టార్ హీరోయిన్ ఫైర్ (పోస్ట్)

by Chukka Sudharani |

ఒకప్పటి స్టార్ హీరోయిన్, బాలీవుడ్ (Bollywood) బ్యూటీ ప్రీతి జింటా (Preity Zinta) తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ (Congress party)పై ఫైర్ అయ్యింది.

Preity Zinta: నకిలీ వార్తలు ప్రచారం చెయ్యడం అవమానకరం.. కాంగ్రెస్ పార్టీపై స్టార్ హీరోయిన్ ఫైర్ (పోస్ట్)
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్, బాలీవుడ్ (Bollywood) బ్యూటీ ప్రీతి జింటా (Preity Zinta) తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ (Congress party)పై ఫైర్ అయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్‌ (New India Co Operative Bank)లో ప్రీతి జింటా తీసుకున్న రూ. 18 కోట్ల రుణం మాపీ అయ్యేందుకు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌ను బీజేపీ (BJP)కి అప్పగించిదని.. దీంతో ఆమె న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో తీసుకున్న రూ. 18 కోట్ల రుణం మాఫీ అయ్యిందని కేరళ కాంగ్రెస్ పార్టీ (Kerala Congress Party) ఆరోపిస్తూ X వేదికగా పలు పోస్టులు పెట్టారు. తాజాగా దీనిపై స్పందించిన ప్రీతి తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యోద్దంటూ ఫైర్ అయ్యింది.

ఈ మేరకు ‘లేదు.. నేను నా సోషల్ మీడియా ఖాతాలను నా స్వంతంగా నేనే నిర్వహిస్తాను. నకిలీ వార్తలను ప్రచారం చేసినందుకు మీకు అవమానకరం! నా కోసం ఎవరూ ఏ రుణాన్ని మాఫీ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ లేదా వారి ప్రతినిధి నా పేరు & చిత్రాలను ఉపయోగించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం & నీచమైన గాసిప్ & క్లిక్ బైట్‌లను ప్రమోట్ చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. 10 ఏళ్ల క్రితం రికార్డు కోసం రుణం తీసుకోవడం జరిగింది అండ్ పూర్తిగా అది తిరిగి చెల్లించబడింది. భవిష్యత్తులో ఎలాంటి అపార్థాలు జరగకుండా ఉండటానికి ఈ పోస్ట్ సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story