MET GALA 2025: భర్తతో రెడ్ కార్పెట్‌పై స్పెషల్ లుక్‌లో కనిపించిన స్టార్ హీరోయిన్.. తల్లి, కొడుకులా ఉన్నారంటూ దారుణ ట్రోల్స్

by Mallepaka Hamsa |

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో ‘సూపర్ షైన్ టైలరింగ్ బ్లాక్ స్టైల్’ అనే థీమ్‌తో ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

MET GALA 2025: భర్తతో రెడ్ కార్పెట్‌పై స్పెషల్ లుక్‌లో కనిపించిన స్టార్ హీరోయిన్.. తల్లి, కొడుకులా ఉన్నారంటూ దారుణ ట్రోల్స్
X

దిశ, సినిమా: న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో ‘సూపర్ షైన్ టైలరింగ్ బ్లాక్ స్టైల్’ అనే థీమ్‌తో ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకలు ఈ సారి మరింత సందడిగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో హాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కియారా అద్వానీ, దిల్జిత్ దొసాంజ్, రిహానా వంటి వారు విభిన్నమైన ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌(Nick Jonas)లు బాల్మెయిన్ ఒలివియర్ రౌస్టింగ్ కస్టమ్ సీస్ కాస్ట్యూమ్‌లో వింటేజ్ హాలీవుడ్ గ్లామర్ లుక్‌తో కనిపించారు. ఇక రెడ్ కార్పెట్‌పై జంటగా నడిచిన వీరిద్దరు అందరి ముందే లిప్ లాక్ ఇచ్చుకుని ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం తల్లి, కొడుకు లాగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వారిపై ట్రోల్స్ చేస్తున్నారు. నిక్ జోనాస్ ప్రియాంకకు కొడుకులా ఉన్నాడని అంటున్నారు. కాగా, ప్రియాంక చోప్రా సినిమాల విషయానకొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. మొదటి మూవీనే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) సరసన నటించనుంది. ఇక ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహిస్తున్నారు. ‘SSMB-29’వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రానుంది.

Next Story