Deepika Padukone: తనకంటే నాలుగేళ్ల చిన్నవాడితో జతకట్టబోతున్న స్టార్ హీరోయిన్.. అవసరమా అంటున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-23 14:28:25  IST  )

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) చివరగా కల్కి(Kalki), సింగం ఆగైన్(Singam Again) వంటి చిత్రాల్లో కనిపించింది.

Deepika Padukone: తనకంటే నాలుగేళ్ల చిన్నవాడితో జతకట్టబోతున్న స్టార్ హీరోయిన్.. అవసరమా అంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) చివరగా కల్కి(Kalki), సింగం ఆగైన్(Singam Again) వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో గత ఏడాది నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె కూతురు యోగక్షేమాలు చూసుకుంటూ మైమరిచిపోతుంది. ఇప్పుడు మళ్లీ దీపికా పదుకొణె సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. వచ్చిన అవకాశాలు మిస్ చేసుకోకుండా అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా, ఈ అమ్మడు ఓ హిట్ సినిమా సీక్వెల్‌లో నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శెట్టి(Rohit Shetty) దర్శకత్వంలో వచ్చిన ‘సింబా’కు ఆయన పార్ట్-2 తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇక మొదటి భాగంలో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), సారా అలీఖాన్ జంటగా నటించగా.. సీక్వెల్‌లో మాత్రం దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కలిసి నటించబోతున్నట్లు టాక్.

అయితే ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సింబా పార్ట్-2 తీసుకురాబోతున్నాము. సూర్యవంశీ వచ్చాక చేయాలనుకుంటున్నాం. అయితే ఇందులో మరికొందరు కూడా భాగం కాబోతున్నారు. కాబట్టి, మేము ఆ విశ్వాన్ని సృష్టించబోతున్నాం. సింబా పార్ట్ 2 ను మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుతున్నాము’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీకంటే నాలుగేళ్ల చిన్నవాడితో నటించడం అవసరమా అని అంటున్నారు.

Next Story