లగ్జరీ కార్లు వదిలేసి ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్.. ఆమె సింపుల్‌నెస్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia butt) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

లగ్జరీ కార్లు వదిలేసి ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్.. ఆమె సింపుల్‌నెస్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia bhatt) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘త్రిబుల్ ఆర్’(RRR) మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. సీత క్యారెక్టర్‌లో ఇరగదీసింది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. స్టార్ హీరో రణబీర్ కపూర్‌‌(Ranabeer Kapoor)ను ప్రేమించి పెళ్ల చేసుకుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా రాహా(Raha) అనే కూతురికి జన్మనిచ్చింది.

ప్రస్తుతం ఓ పక్క ఫ్యామిలీతో మరోపక్క వరుస సినిమాలతో లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడికి వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కూడా ఈ చిన్నది ఓ చిన్న ఆటోలో ప్రయాణించింది. ఇటీవల ఓ సాయంత్రం ముంబైలో అలియా భట్ ఆటోలో తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన అభిమానులు ఆమె సింపుల్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు ఓసారి చూసేయండి. Link

Next Story