ఆదిత్య ధర్ కోసం స్టార్ హీరోల పోటీ

by Pulgam srinivas |

ఆదిత్య ధర్‌తో సినిమా చేయడానికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఆదిత్య ధర్ కోసం స్టార్ హీరోల పోటీ
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడికి భారీ విజయం దక్కితే, స్టార్ హీరోలు మరియు ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు రావడం సహజమే. అలాంటి దర్శకుల్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన పేరు ఆదిత్య ధర్. 'ధురంధర్' చిత్రంతో ఆయన దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

దీంతో ఆదిత్య ధర్ క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఏ హీరోతోనూ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదిత్య ధర్ తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో తెరకెక్కించబోతున్నారు అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

Next Story