గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరో.. పిల్లల చదువు కోసం అన్ని కోట్ల సాయం.. రియల్ హీరో అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-05-08 06:18:03  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) రీసెంట్‌గా ‘రెట్రో’(Retro) మూవీతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరో.. పిల్లల చదువు కోసం అన్ని కోట్ల సాయం.. రియల్ హీరో అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) రీసెంట్‌గా ‘రెట్రో’(Retro) మూవీతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీని సూర్య నిర్మాణ సంస్థ, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మించాయి. అయితే మే 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం వన్ వీక్‌లోనే రూ.108 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా సూర్య మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇప్పుడు తన రెట్రో సినిమాకు వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని పేద విద్యార్థుల చదువుకు దానం చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రెట్రో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తన అగరం ఫౌండేషన్‏కు రెట్రో సినిమా కలెక్షన్స్ నుంచి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన నిర్వాహకులకు స్వయంగా చెక్ అందించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సూర్య మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అలాగే రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా అగరం ఫౌండేషన్‏ను 2006లో సూర్యనే స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద, అనాధ పిల్లలకు చదివిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తుంది. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుని చాలామంది ప్రయోజకులు అయ్యారు.

Next Story