- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందనివాడు అందరివాడు ఎవరో కాదు.. రాపో-22 నుంచి స్టార్ హీరో లుక్ రివీల్
లవర్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’ (Rapo-22).

దిశ, సినిమా: లవర్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాపో-22’ (Rapo-22). 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన రామ్ అండ్ భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర (Upendra) ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఉపేంద్ర పోస్టర్‌ను రివీల్ చేస్తూ.. ‘అందనివాడు.. అందరివాడు.. రియల్ స్టార్ ఉపేంద్ర 'సూర్య కుమార్'గా RAPO22 నుండి మీ ముందుకు వస్తున్నాడు.. ఉత్కంఠభరితమైన రాపో-22 టైటిల్స్ గ్లింప్స్ మే 15న విడుదల అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.






