- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసిన స్టార్ హీరో.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇక ‘బాహుబలి’(Bahubali) మూవీలో విలన్ పాత్రలో నటించి తన నటనతో అందరినీ ఫిదా చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రానా టాక్ షో చేస్తున్నాడు. అలాగే ఓవైపు నిర్మాతగా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మిహిక బజాజ్(Miheeka Bajaj) అనే ఓ అమ్మాయిని ప్రేమించి 2020 ఆగస్టు 8న పెళ్లి కూడా చేసుకున్నాడు.
ఇక అప్పటినుంచి తన భార్యతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన కొన్ని సూపర్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మిహిక తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తన భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘ఈరోజు నగర దీపాలు మాత్రమే వెలుగుతున్నవి కావు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మార్వేల్ మూవీస్‌లో సూపర్ హీరోస్‌గా ఉన్నారని, క్యూట్ కపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పోస్ట్ పై శ్రీ లీల కూడా హ్యాపీ ఎమోజీ జోడించింది.






