- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్షయ్ కుమార్ సినిమాలోకి స్టార్ హీరో ఎంట్రీ.. వైరల్‌గా మారిన న్యూస్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’. ఐకానిక్ ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో భాగంపై ప్రేక్షకుల్లో అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో, ఫిరోజ్ ఎ. నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతీ అప్డేట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా.. రీసెంట్‌గా చిత్ర బృందం రిలీజ్ చేసిన ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్ అయింది. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, అర్షద్ వార్సి, పరేష్ రావల్, దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టాండన్, లారా దత్తా, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, శ్రేయాస్ తల్పడే, దలేర్ మెహందీ తదితర స్టార్ నటులు నటిస్తున్నారు.
ఇప్పుడు ఇందులో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భాగం అయినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అక్షయ్ కుమార్ నటిస్తున్న వెల్‌కమ్ టు ది జంగిల్ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్తలు రాగా.. ఈ వార్తలపై నటుడు కృష్ణను రిపోర్టర్ ప్రశ్నించగా ఆయన చిన్న చిరునవ్వు చిందించారు. దీంతో ఈ కామియో రోల్ ఫిక్స్ అయినట్లు అర్థం అవుతుండగా.. స్ర్కీన్‌పై చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.






