- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్‌డే స్పెషల్ కలాం మూవీ నుంచి స్టార్ హీరో పోస్టర్ రిలీజ్. షూట్ బిగిన్స్ అంటూ పోస్ట్
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) జీవితం ఆధారంగా సినిమాగా రానున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) జీవితం ఆధారంగా సినిమాగా రానున్న సంగతి తెలిసిందే. 'కలాం' పేరుతో తెరకెక్కే ఈ బయోపిక్‌కు ఓం రౌత్(Om Routh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, టీ-సిరీస్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన కలాం స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించ బోతున్నారు.
అయితే నేడు హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా కలాం మూవీ నుంచి ఇతనికి సంబంధించిన ఓ క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.‘టీం #KALAM - 𝗧𝗵𝗲 𝗠𝗶𝘀𝘀𝗶𝗹𝗲 𝗠𝗮𝗻 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮 ప్రతిభావంతులైన @dhanushkraja పుట్టినరోజు శుభాకాంక్షలు.. డాక్టర్ APJ అబ్దుల్ కలాం జీ పాత్రను ఆయన పోషించిన విధానం రాబోయే సంవత్సరాలలో చర్చనీయాంశంగా మారుతుంది.. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది’ అని రాసుకొస్తూ విష్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






