‘ఐపీఎల్‌లో అదరగొడుతున్నవ్.. నిన్ను ఇలా చూస్తుంటే హ్యాపీగా ఉంది’.. క్రికెటర్‌పై స్టార్ హీరో ప్రశంసలు

by Gantepaka Srikanth |

రెమో, ప్రిన్స్, డాన్, అమరాన్ వంటి సినిమాలతో తెలుగులోనూ తమిళ నటుడు శివ కార్తికేయన్‌(Sivakarthikeyan) అభిమానులను సొంతం చేసుకున్నారు.

‘ఐపీఎల్‌లో అదరగొడుతున్నవ్.. నిన్ను ఇలా చూస్తుంటే హ్యాపీగా ఉంది’.. క్రికెటర్‌పై స్టార్ హీరో ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: రెమో, ప్రిన్స్, డాన్, అమరాన్ వంటి సినిమాలతో తెలుగులోనూ తమిళ నటుడు శివ కార్తికేయన్‌(Sivakarthikeyan) అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మదరాసి అని సినిమా చేస్తున్నారు. ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో శివ కార్తికేయన్ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఐపీఎల్‌లో అదరగొడుతున్న క్రికెటర్‌ను శివ కార్తికేయన్‌ అభినందించారు.


ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సాయి సుదర్శన్‌(Sai Sudarshan)ను ప్రశంసించారు. ‘నీ ఆటతీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే రాణించు. త్వరలోనే నిన్ను ఇండియన్ జెర్సీలో చూడాలని కోరుకుంటున్నాను’ అని శివ కార్తికేయన్‌ ట్వీట్ పెట్టారు. దానికి సాయి సుదర్శన్ స్పందిస్తూ.. ‘థాంక్యూ శివ అన్నా.. మీ అభినందన నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని రిప్లై ఇచ్చారు. కాగా, నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అదరగొట్టారు. 36 బంతుల్లో 52 పరుగులు చేసి.. గుజరాత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

Next Story