- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త సినిమా ప్రకటించిన స్టార్ హీరో.. తుఫాను మొదలుకాబోతుందంటూ పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్న ఆయన బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల ‘తుడరుమ్’ చిత్రంతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం హృదయ పూర్వం, కన్నప్ప వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మోహన్ లాల్ మరో చిత్రాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు కావడంతో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ‘వృషభ’(Vrusshabha) సినిమాతో రాబోతున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అయితే నంద కిషోర్(Nanda Kishore) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్ ప్రజెంట్స్, అభిషేక్ వాస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై దీనిని శోభా కపూర్(Shobha Kapoor), ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 16న థియేటర్స్‌లోకి రాబోతుంది.
అయితే మోహన్‌లాల్ ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ... ‘‘ఇది ప్రత్యేకమైనది — నా అభిమానులందరికీ దీన్ని అంకితం చేస్తున్నాను. నిరీక్షణ ముగుస్తోంది. తుఫాను మొదలుకాబోతుంది. గర్వం , శక్తితో, ‘వృషభ’ ఫస్ట్ లుక్‌ను నేను ఆవిష్కరిస్తున్నాను. ఇది మీ ఆత్మను మండించే కథ.. కాలక్రమేణా ప్రతిధ్వనిస్తుంది. నా పుట్టినరోజున దీన్ని ఆవిష్కరించడం వల్ల అది మరింత అర్థవంతంగా ఉంటుంది - మీ ప్రేమ ఎల్లప్పుడూ నా గొప్ప బలం’’ అని రాసుకొచ్చారు. ఇక ఆయన షేర్ చేసిన పోస్టర్‌లో.. గుబురు గడ్డం, జుట్టుతో ఓ రాజుల కాలంలో ధరించిన డ్రెస్ మాదిరి దాన్ని ఒళ్లంతా పెట్టుకున్న ఆయన ఓ కత్తితో కోపంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.






