- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రామాయణ’ ధర చూసి షాక్ అవుతున్న స్టార్ డిస్ట్రిబ్యూటర్స్
తాజా సమాచారం ప్రకారం, “రామాయణ” హిందీ థియేట్రికల్ హక్కుల కోసం ఈ చిత్ర నిర్మాత సుమారు 450 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రాలలో “రామాయణ” ఒకటిగా నిలుస్తోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా, సాయి పల్లవి సీతగా నటించబోతోంది. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మొదటి భాగాన్ని ఈ దీపావళికి, రెండవ భాగాన్ని వచ్చే దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొనడంతో థియేట్రికల్ హక్కుల విషయంలో కూడా పెద్ద స్థాయిలో పోటీ నెలకొంది.
ముఖ్యంగా హిందీ థియేటర్ హక్కుల కోసం పలు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నప్పటికీ, నిర్మాత నమిత్ మల్హోత్రా కోరుతున్న ధర మాత్రం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, “రామాయణ” హిందీ థియేటర్ హక్కుల కోసం ఆయన సుమారు 450 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ధర కారణంగా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల షారుఖ్ ఖాన్ నటిస్తున్న “కింగ్” చిత్ర హిందీ హక్కులు సుమారు 250 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ రేంజ్ వరకు “రామాయణ” హక్కులు కొనుగోలు చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నప్పటికీ, 450 కోట్ల ధర అనగానే డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది.






