- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఉస్తాద్ భగత్ సింగ్'లో స్టార్ డైరెక్టర్
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తమిళ సీనియర్ స్టార్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రలో నటించినట్లు ఈ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మార్చ్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కొక్కటి బయటపెడుతూ వస్తున్నాడు. తాజాగా ఈయన తమిళ సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కె.ఎస్. రవికుమార్ మా చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ఆయన రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారితో ఎన్నో సూపర్ హిట్స్ రూపొందించాడు. అ
లాంటి డైరెక్టర్ మా సెట్లో ఉన్నప్పుడు ఎంతో వినయంగా సార్ నేను ఈ సన్నివేశంలో ఇలా తిరగమంటారా, నేను ఇప్పుడు ఇలాంటి డైలాగ్ చెప్పమంటారా అని నన్ను అడిగేవారు. అప్పుడు నేను సార్ మీరు ఎంతో గొప్ప డైరెక్టర్.. మీలాంటి వారు అలా అంటున్నారు అంటే కచ్చితంగా అది పర్ఫెక్ట్ అని నేను ఆయనతో అన్న సందర్భాలు ఉన్నాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్, తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పార్థిబన్ విలన్ పాత్రలో నటించాడు. రావు రమేష్, కె.ఎస్. రవికుమార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.






