- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyadarshi: ప్రియదర్శికి స్పెషల్ గిఫ్ట్ పంపిన స్టార్ కపుల్ .. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంటూ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) అందరికీ సుపరిచితమే. ఆయన మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) అందరికీ సుపరిచితమే. ఆయన మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ‘మల్లేశం’ సినిమాతో హీరోగా మారిన ఆయన వరుస ప్రాజెక్ట్స్‌లో నటించారు. ‘బలగం’ (Balagam)మూవీతో ప్రియదర్శి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల హృదయాలకు హత్తుకుంది. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఎన్నో విడిపోయిన కుటుంబాలను కలిపింది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రియదర్శి చేసిన సినిమాలన్నీ పెద్దగా హిట్ కాలేకపోయాయి. ఇక ఇటీవల ఆయన నటించిన ‘కోర్టు’ (Court)ఊహించని విధంగా బాక్సాఫీసును షేక్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తి లేదు. ప్రియదర్శి నటనను మెచ్చి ఆయన ఓ స్టార్ కపుల్ గిఫ్ట్ కూడా పంపారు.
తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘సూర్య అన్న జ్యోతిక మేడమ్‌కు మా సినిమా నచ్చనందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పంపిన సందేశం, పువ్వులు నా హృదయాన్ని మాటల్లో చెప్పలేనంతగా నింపేశాయి. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. నన్ను ఎంతగానో ప్రేరేపించిన న్యాయవాదులు చంద్రు జై భీమ్ సినిమాలో సూర్య చేసిన పాత్ర అలాగే పోన్‌మగల్ వందాల్ చిత్రంలో జ్యోతిక చేసిన పాత్ర వెంబా. వెన్నుతట్టి ప్రోత్సహించినట్లుగా అనిపించింది. వినయంగా సూర్యతేజ మాటల్లో.. ఉంగలోడియా ఆశీర్వాదం తేవయప్ప..’’ అని రాసుకొచ్చాడు. అలాగే ఫొటోలు కూడా షేర్ చేశారు. ఈ ఒక్క గిఫ్ట్‌తో ప్రియదర్శి రేంజ్ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ అన్నా మీకు ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ నుంచి ప్రశంసలు రావడం గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 25న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.






