- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14వ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్.. శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గంగోత్రి’(Gangothri) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే విజయం సాధించాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గంగోత్రి’(Gangothri) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే విజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించాడు.
అలాగే ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఇక ఈ మూవీ ప్రీమియర్ షో కి వెళ్లినప్పుడు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ చనిపోగా అతని కుమారుడు హాస్పిటల్‌లో చికిత్స్ పొందుతున్నాడు. ఈ ఘటనలో బన్నీ జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram)తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. స్నేహారెడ్డి(Sneha Reddy)ని ప్రేమించి 2011 మార్చి 6న ఆమెను బన్నీ పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఈ జంటకు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. వారి పేర్లు అయాన్(Ayan), అర్హ(Arha). అయితే నిన్న వీరి 14వ వివాహ వార్షికోత్సవం(మ్యారేజ్ యానివర్సరీ). దీంతో ఈ జంట తమ పెళ్లి రోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ కపుల్‌ను పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






