ఆ పండుగకు రిలీజ్ కాబోతున్న తెలుసు కదా మూవీ.. నా బాధ అప్పుడే తెలుస్తుందిలే అంటూ స్టార్ బాయ్ క్రేజీ వీడియో

by I. Sairam |   (  Updated:2025-06-02 07:22:09  IST  )

రీసెంట్‌గా ‘జాక్’(Jack) మూవీతో ఓకే ఓకే అనిపించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’(Telusu Kada).

ఆ పండుగకు రిలీజ్ కాబోతున్న తెలుసు కదా మూవీ.. నా బాధ అప్పుడే తెలుస్తుందిలే అంటూ స్టార్ బాయ్ క్రేజీ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా ‘జాక్’(Jack) మూవీతో ఓకే ఓకే అనిపించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’(Telusu Kada). నీరజ కోన(Neeraja Kona) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌(TG Vishwaprasad) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), రాశీఖన్నా(Rashi Khanna) కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇక ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ విడుదల తేదీని ప్రకటించారు. కాగా ఈ చిత్రం దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.

ఇక వీడియోను చూసినట్లయితే.. సిద్ధు జొన్నలగడ్డ మొబైల్‌లో సీరియస్‌గా గేమ్ ఆడుతుండగా.. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి వీడియో కాల్ చేస్తుంది. అప్పడు హీరో లిఫ్ట్ చేసి ఏంటి సడెన్‌గా కాల్ చేశావు అని అడుగగా.. చూడాలనిపించి చేశా అని అంటుంది. అలా ఆమెతో మాట్లాడుతున్న టైంలో రాశి ఖన్నా కూడా సిద్ధుకి కాల్ చేస్తుంది. అప్పడు అతను ఆఫీస్ కాల్ వస్తుంది మళ్లీ చేస్తా అని శ్రీనిధి కాల్‌ను కట్ చేస్తాడు. ఇక రాశి ఖన్నా ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అతన్ని అడుగగా.. ఆఫీస్ కాల్ అని చెప్పి ఏంటి వీడియో కాల్ చేశావు అని అడుగుతావు. రాశీ కూడా సేమ్ చూడాలనిపించి చేశా అని అంటుంది. ఇక ఎంతసేపైనా సిద్ధు నుంచి మళ్లీ ఫోన్ రాకపోయేసరికి శ్రీనిధి తిరిగి అతనికి కాల్ చేస్తుంది.

అప్పడు అతని ఫోన్ బిజీ బిజీ వస్తుంది. దీంతో వెంటనే రాశికి కాల్ చేయగా ఆమెది కూడా ఫోన్ బిజీ వస్తుంది. అయితే రాశి శ్రీనిధి కాల్ లిఫ్ట్ చేసి ముగ్గురికి కాన్ఫరెన్స్ కలుపుతుంది. అప్పుడు శ్రీనిధి ఇదేనా నీ ఆఫీస్ కాల్ అని అడుగుతుంది. అవును నా సిద్దు నాతో మాట్లాడుతున్నాడు నీకేంటి అని రాశీ అనగా.. నీ కాల్ కట్ చేసి నాతోనే మాట్లాడుతాడు అని శ్రీనిధి అంటుంది. కాదు నాతోనే మాట్లాడుతాడు అని రాశి.. కాదు నాతోనే మాట్లాడుతాడు అని శ్రీనిధి అలా వీరిద్దరి మధ్య వార్ అవుతుండగా.. సిద్ధు ష్.. తెలుసు కదా.. లవ్‌ యూ టు..అని ఇద్దరి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇక ఫైనల్‌గా సిద్ధు మీకు తెలుసా.. తెలుస్తుందిలే.. అక్టోబర్ 17కి అని చెబుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story