- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనితో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన స్టార్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది(Sidhanth Chathurvedi), యంగ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘ధడక్-2’(Dhadak-2).

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది(Sidhanth Chathurvedi), యంగ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘ధడక్-2’(Dhadak-2). ఇక దీనికి షాజియా ఇక్బాల్(Shazia Iqbal) దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్ పై కరణ్ జోహార్(Karan Johar) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ ఆగస్టు 1న థియేటర్లలోకి రాబోతుంది. ఇక ఈ సినిమా 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ధడక్(Dhadak)కు సీక్వేల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిప్తి డిమ్రీ తన ఇన్‌స్టా(Instagram)లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అందులో సిద్ధాంత్ చతుర్వేదితో దిగిన క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేసింది. అలాగే గిబిలి ట్రెండ్‌ను యాడ్ చేసిన ఫొటోను కూడా పంచుకుంది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు ఆల్‌ది బెస్ట్‌తో పాటు కంగ్రాట్స్ చెబుతున్నారు.






