అతని చిటికెన వేలును పట్టుకున్న ఫోటో షేర్ చేసిన స్టార్ బ్యూటీ.. 4 ఇయర్స్ అంటూ పోస్ట్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్

by I. Sairam |

నాని (Nani) హీరోగా రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy).

అతని చిటికెన వేలును పట్టుకున్న ఫోటో షేర్ చేసిన స్టార్ బ్యూటీ.. 4 ఇయర్స్ అంటూ పోస్ట్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నాని (Nani) హీరోగా రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy). ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి (Venkat Boyanapalli) నిర్మించిన ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించారు. ఇక ఈ మూవీలో సాయి పల్లవి (Sai Pallavi), కృతి శెట్టి (Krithi Shetty)లు హీరోయిన్లుగా నటించారు. అయితే 2021 డిసెంబర్ 24న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది.

అయితే నిన్నటితో ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో నాని చిటికెన వేలును పట్టుకన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నెలరాజు-ఇలరాణి ప్రణయ కావ్యానికి నాలుగేళ్లు’ అని రాసుకొస్తూ రెడ్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు గానూ మూవీటీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రజెంట్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది. రాకింగ్ స్టార్ యష్ రావాణాసురుడు పాత్రలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ మూవీతో పాటు ఎంఎస్ సుబ్బలక్ష్మీ పాత్రలో కూడా సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.




Next Story