- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిడ్ నైట్ ఆ పని చేస్తున్నామంటూ స్టార్ బ్యూటీ పోస్ట్..
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది కీర్తి.
ఈ నేపథ్యంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో ఆమె హీరోయిన్ మమితా బైజుతో పాటు మరో అమ్మాయితో కారులో కూర్చుని టీ తాగుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘మిడ్‌నైట్ ఛాయ్ తాగుతున్నాము’ అంటూ రెడ్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.






