- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిర్రాక్ లుక్‌లో స్టార్ బ్యూటీ.. అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు..
‘యానిమల్’(Animal) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘యానిమల్’(Animal) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. అలా బడా దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రజెంట్ ‘స్పిరిట్’(Spirit), ‘ధడక్-2’(Dhadak-2) వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇక ధడక్-2 చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi), యానిమల్ భామ త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) దర్శకత్వం వహించబోతుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ జంట ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా త్రిప్తి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డెనిమ్ ఫ్రాక్ వేసుకుని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుని దర్శనమిచ్చింది. అంతేకాకుండా హీరో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి కొన్ని క్యూట్ స్టిల్స్‌కు పోజులిచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






