- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లాయర్’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో స్టార్ బ్యూటీ.. ఎక్జైటింగ్‌గా ఉందంటూ విజయ్ ఆంటోని ట్వీట్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) గత ఏడాది ‘రోమియో’(Romeo) సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) గత ఏడాది ‘రోమియో’(Romeo) సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలు ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. అయితే ఇటీవల విజయ్ తన 26వ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ‘లాయర్’(Lawyer) టైటిల్‌తో రాబోతుంది. ఇక దీనికి ‘జెంటిల్ ఉమెన్’ చిత్రంతో హిట్ సాధించిన జోషువా సేతురామన్(Joshua Sethuraman) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ కంపెనీ, విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై విజయ్ భార్య నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
తాజాగా, ‘లాయర్’ చిత్రంలో ఓ నటి జాయిన్ అయినట్లు విజయ్ ఆంటోనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇందులో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ రవీనా టాండన్ (Raveena Tandon)నటిస్తోంది. ఆమెకు వెల్ కమ్ చెప్తూ.. ఈ జర్నీలో ఆమె భాగం కావడం తనకు చాలా ఎక్జైటింగ్‌గా ఉందని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆమె ఫస్ట్ లుక్‌ను కూడా షేర్ చేశాడు. ఇక ఇందులో రవీనా టాండన్ లాయర్ దుస్తుల్లో కోపంగా చూస్తుండగా.. ఇంగ్లీష్ పేపర్లు ఆమె చుట్టూరా కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక కోర్టులో రవీనా నటించడం డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘‘విజయ్ ‘జెంటిల్ ఉమెన్’ చూసిన తర్వాత నన్ను సంప్రదించాడు. నా పని తీరు నచ్చడంతో కలిసి పని చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. జెంటిల్ ఉమెన్ OTT లో వచ్చిన తర్వాత, బాలీవుడ్ నుండి చాలా మంది నాకు ఫోన్ చేశారు. నేను FTII లో చదివినప్పటి నుండి, నాకు బాలీవుడ్ లో పనిచేస్తున్న స్నేహితులు ఉన్నారు. అలా నేను రవీనా టాండన్‌ను సంప్రదించాను. నా తొలి చిత్రం జెంటిల్ ఉమెన్ చూసిన తర్వాత నా పని గురించి ఆమెకు ఒక ఆలోచన వస్తుందని నేను రవీనాకు చెప్పాను. ఆమె ఆ సినిమా చూసిన తర్వాత, నేను వెంటనే ‘లాయర్’ కథను వివరించాను. స్టోరీ నచ్చడంతో ఆమె కూడా నటించేందుకు ఆసక్తి చూపింది’’ అని చెప్పుకొచ్చాడు.






