- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మెగా 158'లో నెగిటివ్ పాత్రలో యంగ్ బ్యూటీ
మెగా 158లో డింపుల్ హయాతి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 158వ చిత్రం కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించనుండగా, ప్రియమణి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనుండగా, తమన్ సంగీతం అందించబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఐటెం పాటల్లో, కమర్షియల్ సినిమాల్లో అందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, మొట్టమొదటిసారి నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో, ఈ న్యూస్ నిజమైతే డింపుల్ హయాతికి ఇది సూపర్ ఛాన్స్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






