SSMB-29: మహేష్ బాబు- రాజమౌళి సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. క్యూరియాసిటీ పెంచుతున్న న్యూస్

by I. Sairam |

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

SSMB-29: మహేష్ బాబు- రాజమౌళి సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. క్యూరియాసిటీ పెంచుతున్న న్యూస్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తోంది. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కథ అందించగా.. దుర్గా ఆర్ట్స్(Durga Arts) బ్యానర్ పై కె.ఎల్ నారాయణ(KL Narayana) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి కీరవాణి(Keeravani) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

అయితే పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నాడు. లాస్ట్ ఇయర్ నుంచే సోషల్ మీడియాకు దూరం ఉంటూ ఎక్కడికి వెళ్లినా క్యాప్‌తో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటీవలె రాజమౌళి ఈ మూవీ షూట్ కోసం మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్నట్లు సింహాన్ని బోన్‌లో వేసినట్లు పెట్టిన ఓ పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా గుట్టు చప్పుడు కాకుండా ముగించుకున్న సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. SSMB-29లో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్(Nana Patekar) నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై మూవీ టీమ్ ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కథ నచ్చి ఆయన ఓకే చెబితే ఈ మూవీలో ఆయన పాత్ర విలన్ క్యారెక్టర్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Next Story