- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన తమన్..కారణం ఇదే
నారా లోకేష్ ను టాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు తమన్ కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తమన్ పేర్కొన్నారు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ను టాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు తమన్ కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తమన్ పేర్కొన్నారు. నారా లోకేష్ తో దిగిన ఫోటోలు పంచుకున్నారు. మంత్రి నారా లోకేష్ తో భేటీ ఎంతో అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా వివరించారు. త్వరలో జరగబోయే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పై ఈ సందర్భంగా తమన్, నారా లోకేష్ మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు నందమూరి బాలయ్య నటించిన ఆఖండ 2 సినిమా సక్సెస్ అయినందుకు గాను తమన్ ను ప్రశంసించారట లోకేష్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే మ్యూజిక్, కళలకు సంబంధించిన పలు కొత్త ప్రాజెక్టులపై కూడా ఈ ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో నారా లోకేష్, తమన్ భేటీకి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.






