- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వారణాసి’కి ముందు థియేటర్స్ లోకి జక్కన్న ఐకానిక్ సినిమా.. వెయిట్ ఫర్ ఇట్ అంటూ ట్వీట్
రాజమౌళితో సినిమా చేసే ఏ హీరో అయినా సరే.. కనీసం రెండు మూడేళ్లపాటు కాల్షీట్స్ ఆయనకు..

దిశ, వెబ్‌డెస్క్: రాజమౌళితో సినిమా చేసే ఏ హీరో అయినా సరే.. కనీసం రెండు మూడేళ్లపాటు కాల్షీట్స్ ఆయనకు కేటాయించాల్సిందే. ఆయన తీసే సినిమాలు కూడా అందుకు వర్త్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి. షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరిగిపోతుండగానే.. బాహుబలి1, బాహుబలి 2 కలిపి.. బాహుబలి ది ఎపిక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండటంతో.. జక్కన్న కూడా దానిని ఫాలో అవుతున్నారు.
2026లో కూడా ఒక ఐకానిక్ సినిమా రీ రిలీజ్ ను ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని వారణాసి టీమ్ కన్ఫర్మ్ చేస్తూ.. ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టింది. దర్శకధీరుడిగా పేరొందిన జక్కన్న.. భారీ బడ్జెట్ సినిమాలు చేసి సక్సెస్ ను అందుకుంటున్నారు. ఆయన టెక్నికల్ గా తీసిన సినిమా ఈగ. నాచురల్ స్టార్ నాని, సమంత, కిచ్చా సుదీప్ ల కాంబినేషన్లో తీసిన ఈ సినిమా ఎంతోమంది మనసుల్ని హత్తుకుంది. 2012 జులై 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాను 2026లో రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అంటూ వారణాసి టీమ ట్వీట్ చేసింది.






