- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముదురుతున్న శ్రీనివాసా గోవిందా ర్యాప్ సాంగ్ వివాదం.. చివరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకున్న చిత్రబృందం
కోలీవుడ్ నటుడు సంతానం(Santhanam) నటిస్తున్న తాజా చిత్రం ‘డీడీ నెక్ట్స్ లెవల్’(DD Next Level).

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు సంతానం(Santhanam) నటిస్తున్న తాజా చిత్రం ‘డీడీ నెక్ట్స్ లెవల్’(DD Next Level). గతంలో వచ్చిన డీడీ, డీడీ రిటర్న్స్ సినిమాలకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. కామెడీ హారర్ చిత్రంగా రాబోతుంది. దీనికి S. ప్రేమ్ ఆనంద్(Prem Anand) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. అయితే ఈ చిత్రంలో గీతిక తివారీ, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 16న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలో.. ‘డీడీ నెక్ట్స్ లెవల్’ శ్రీనివాసా గోవిందా అనే ర్యాప్ సాంగ్ వివాదానికి దారి తీసింది.
శ్రీవారిని అవమానించారంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్ట్ సభ్యుడు, బీజేపీ ప్రతినిధి భానుప్రకాష్ సంతానంతో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు కూడా పంపారు. కిస్తా-47లో శ్రీనివాసా గోవిందా కీర్తనను ఉపయోగించడం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. ఆ పదాన్ని వాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఫైర్ అయ్యారు. క్త్రైస్తవ లేదా ఇస్లాం మతాలకు సంబంధించిన ప్రార్ధనలను ఇలా ర్యాప్ పాటల్లో ఉపయోగిస్తారా? అని ప్రశ్నించాడు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ గీతాన్ని తొలగించకపోతే రూ.100 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేస్తానని చిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చారు. ఈ లీగల్ నోటీసు కాపీని సెన్సార్ బోర్డుకు కూడా పంపామని, సినిమా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు వారు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘డీడీ నెక్ట్స్ లెవల్’ మూవీ విడుదలకు ఒకరోజు ముందు చిత్రబృందం ఏం చేయలేని పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివాదం తీవ్రం కావడంతో సినిమా నుంచి సాంగ్ ని తొలగించినట్లు తెలుస్తోంది. స్వామి వారి నామాలను కించపరిచేలా సినిమాలో పాట ఉందంటూ వరుస కథనాలు ప్రసారం కావడంతో విడుదలకు ముందు వివాదాన్ని రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి వెనక్కి తగ్గినట్లు టాక్.






