- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srinidhi Shetty: అందమైన కథలతో మీ ముందుకు వచ్చే అవకాశాలు రావాలని కోరుకుంటున్న.. పాన్ ఇండియా హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్
‘కేజీఎఫ్’ (KGF) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).

దిశ, సినిమా: ‘కేజీఎఫ్’ (KGF) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). ఇక మొదటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకున్న ఈ అమ్మడు.. కేజీఎఫ్-2 (KGF-2) తర్వాత తన గ్రాఫ్ మరింత పెంచుకుంది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా మంచిగానే అందిపుచ్చుకుంది. ఇందులో భాగంగా.. తాజాగా ‘హిట్-3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన ఈ మూవీలో శ్రీనిధి కూడా పోలీస్ పాత్రలో నటించి.. గ్లామరస్ పాత్రతో పాటు యాక్షన్ సీన్స్‌లో కూడా తన సత్తా చాటుకుంది. డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది.
దీంతో ప్రజెంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తన ఆనందాన్ని సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది శ్రీనిధి శెట్టి. ‘‘HIT3’ కి మీరు ఇచ్చిన ఆశీస్సులు & ప్రేమకు నా ఈ హృదయం ఎంత కృతజ్ఞతతో నిండిపోయిందో ఈ సముద్రం సంగ్రహించగలదు. అందమైన కథలతో మీ ముందుకు వచ్చే అవకాశాలు నాకు రావాలని నేను ఆ దేవుడిని చాలా వినయంగా ప్రార్థిస్తున్నాను. 4 రోజుల్లో HIT3 ప్రపంచవ్యాప్తంగా 101+ కోట్ల గ్రాస్ రాబట్టింది’ అంటూ సముద్రం ఒడ్డున ఉన్న పిక్‌ను షేర్ చేసింది శ్రీనిధి.






