- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను ప్రభాస్ లేడీ వెర్షన్ అంటారు.. యంగ్ హీరోయిన్ కామెంట్స్‌కు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’.

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17 న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి.. తనను ప్రభాస్ లేడీ వెర్షన్ అంటారని కామెంట్స్ చేసింది. ‘నా ఫ్రెండ్స్ అందరూ నన్ను లేడీ ప్రభాస్ అంటారు. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియా ఉపయోగించరు. నేను కూడా ఆయన లాగే పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను.
అందుకే నన్ను ప్రభాస్ లేడీ వెర్షన్ అంటూ కామెంట్ చేస్తారు మా ఫ్రెండ్స్. కానీ ఆయన ఓ బిగ్ స్టార్. మనం అలా కాదు.. అందుకే కనీసం నువ్వు ఏదన్న చెయ్యి అంటారు. అయితే.. నేను ఫొటోలు తీసుకోకుండా ఏం ఉండను. ఏదైనా సందర్భంలో, ఎక్కడికి వెళ్లిన ఫొటోలు తీసుకుంటాను. ఫొటో షూట్ ప్లానింగ్ ఉండదు అంతే. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అనేది ఏం ఉండదు.. ఎలా ఉంటే అలాగే తీసుకుంటాను. ఇప్పుడు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నానా.. షేర్ చెయ్యడానికి ఒక్క ఫొటో కూడా లేదు.. నాకు అంత టైమ్ లేదు’ అని తెలిపింది శ్రీనిధి శెట్టి. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.






