Srinidhi Shetty: ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే రోజంతా ఆ పనే చేస్తా.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-07-18 09:07:43  IST  )

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Srinidhi Shetty: ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే రోజంతా ఆ పనే చేస్తా.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘కేజీఎఫ్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా వచ్చిన ‘హిట్-3’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో అభిమానుల ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ప్రభాస్ తన సినిమాలో వర్క్ చేసే వారికి ఫుడ్ తన ఇంటి నుంచే తెప్పిస్తారని విన్నాను. ఆయన పెట్టే టేస్టీ ఫుడ్, రకరకాల వంటకాలు చాలా మంది సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే.. నేను పెద్ద తిండిపోతుని. నాకే కనుక ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే రోజంతా తినగలను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story