- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srinidhi Shetty: ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తున్న 'కెజిఎఫ్' బ్యూటీ
పింక్ చీరలో మెరిసిపోయిన కెజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్ రంగం ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కెజిఎఫ్’ మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీనిధి, మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక ‘కెజిఎఫ్’ సిరీస్ సినిమాల తర్వాత ఈమె నటించిన కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. ‘హిట్ 3’ చిత్రం ద్వారా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత ఈమె తెలుగులో నటించిన ‘తెలుసు కదా’ చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
సినిమాల్లో ఈమె ఎక్కువగా అందాలను ఆరబోయకుండా నటనకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె స్కిన్ షోకు కాస్త దూరంగానే ఉంటుంది. తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
అందులో ఈ యంగ్ బ్యూటీ గులాబీ రంగు చీరలో, అందుకు తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో క్యూట్ స్మైల్‌తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈమె మెడలో ధరించిన భారీ నెక్లెస్, అందమైన కురులు ఈమె గ్లామర్‌ను మరింతగా పెంచాయి. దాంతో ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






