- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ పోతినేని మూవీలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ ఫిక్స్!
రామ్ పోతినేని స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

దిశ, సినిమా: సింగర్‌గా, గేయరచయితగా, హీరోగా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న యంగ్ నటుడు రామ్ పోతినేని.. ఇప్పుడు డైరెక్టర్‌గా కొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధం అయ్యాడు. తన 23వ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నట్లు తాజాగా తన బర్త్‌డే సందర్భంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ’RAPO23’ గా తెరకెక్కుతోన్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ ‘వీర’ అనే పాత్రలో కనిపించనుండగా.. లెదర్ జాకెట్‌తో వెనకవైపు నిలబడి ఉన్న లుక్‌ను షేర్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. ‘ఒంటరి తోడేలు కథ ఇది’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఇందులో రామ్ సరసన ఫీమేల్ లీడ్ కోసం యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మాక్సిమమ్ ఈ బ్యూటీనే ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇది కన్ఫర్మ్ కాకపోతే సెకండ్ చాయిస్‌గా సంయుక్త మీనన్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం.
పెద్ది ట్రైలర్ చూసి ఈ విషయం చెబుతున్నా.. చిరు లీక్‌తో అమాంతం పెరిగిన






