Chiranjeevi: పెద్ది ట్రైలర్ చూసి ఈ విషయం చెబుతున్నా.. చిరు లీక్‌తో అమాంతం పెరిగిన అంచనాలు

by Pulgam srinivas |

పెద్ది ట్రైలర్ మీరు ఎంత ఊహించుకున్నా అంతకుమించి ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Chiranjeevi: పెద్ది ట్రైలర్ చూసి ఈ విషయం చెబుతున్నా.. చిరు లీక్‌తో అమాంతం పెరిగిన అంచనాలు
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా పెద్ది చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మే 18న ఈ చిత్ర ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా పెద్ది ట్రైలర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేకాకుండా, తనదైన శైలిలో ఓ చిన్న లీక్ కూడా ఇచ్చారు.

తాజాగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... “పెద్ది ట్రైలర్ చూసాను.. అద్భుతంగా అనిపించింది. ఆ మూడు నిమిషాలు ప్యూర్ ఫైర్... పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. అందరూ కలిసి రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా దానికంటే ఎక్కువగానే ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్, ఎలివేషన్, మేడ్నెస్... అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అన్నట్టు... చాలా రోజులయ్యింది మీకు చిరు_లీక్స్ ఇచ్చి... "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు"... సారీ బుచ్చిబాబు... చూసాక కంట్రోల్ తప్పింది... అంటూ పోస్ట్ చేశారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలతో పెద్ది ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగాయని, సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story