Srinidhi Shetty: శ్రీనిధి శెట్టికి మరో బంపర్ ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ సినిమాలో చాన్స్ అందుకున్న కన్నడ బ్యూటీ

by Chukka Sudharani |   (  Updated:2025-06-13 14:04:10  IST  )

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టికి మరో బంపర్ ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ సినిమాలో చాన్స్ అందుకున్న కన్నడ బ్యూటీ
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా వచ్చిన ‘హిట్-3’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ కన్నడ బ్యూటీ.. రీసెంట్‌గా మరో బంపర్ అందుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం తన 64వ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘AK-64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతుండగా.. ఇందులో నటిస్తున్న నటీనటులపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు చిత్ర బృందం. ఈ మేరకు తాజాగా ‘AK-64’లో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే కథ చెప్పగా శ్రీనిధికి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ అమ్మడు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి ఉండాల్సి ఉంది.

Next Story