Sreeleela: కొంటె చూపులతో కవ్విస్తున్న క్యూట్ బ్యూటీ

by Pulgam srinivas |

చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో కొంటె చూపులతో కవ్విస్తున్న శ్రీలీల

Sreeleela: కొంటె చూపులతో కవ్విస్తున్న క్యూట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందD అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన ధమాకా సూపర్ హిట్ అయ్యి ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.




ఇందులోని ఈమె డాన్స్ కి, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దానితో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. ఈమెకు ఆఫర్లు క్యూ కట్టాయి కానీ విజయాలు మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా చాలా చురుగ్గా నటిస్తోంది. కొంతకాలం క్రితం ఈమె నటించిన పరాశక్తి అనే తమిళ సినిమా విడుదల అయింది.




ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు గుబులు రేపుతున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఒలకబోస్తోంది. ఇప్పటికి అనేకసార్లు ఈమెకు సంబంధించిన ఫోటోలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.




తాజాగా శ్రీలీల తన 'ఇన్ స్టా'లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ లైట్ పర్పుల్ కలర్ శారీని కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి, కురులను విరబోసుకొని క్యూట్ స్మైల్ తో కవ్వించే విధంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.




ఈ ఫోటోకి రాశి ఖన్నా 'సుందర్' అని కామెంట్ పెట్టి ఓ లవ్ సింబల్ ఎమోజిని కూడా పోస్ట్ చేసింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీ మార్చి 19వ తేదీన విడుదల కానుంది.

Next Story