Srileela: పెళ్లి కూతురుగా మెడలో దండలతో దర్శనమిచ్చిన శ్రీలీల.. షాక్‌లో ఫ్యాన్స్!

by Chukka Sudharani |

‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల (Srileela)

Srileela: పెళ్లి కూతురుగా మెడలో దండలతో దర్శనమిచ్చిన శ్రీలీల.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల (Srileela). ఇక ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. అలాగే రీసెంట్‌గా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2) మూవీలో ‘కిస్సిక్’(Kisssik) సాంగ్‌లో చిందులేసి యువతతో పాటు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇలా ప్రోఫినల్‌గా ఎంత బిజీగా ఉన్నా కూడా తన పర్సనల్ టైమ్ కూడా మంచిగా వినియోగించుకుంటూ సంతోషంగా ఉంటోంది.

ఖాళీ దొరికితే తన తల్లితో ఏదో ఒక వెకేషన్‌కు చెక్కేస్తు.. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ రీసెంట్‌గా తమిళనాడు (TamilNadu)లోని చిదంబరంలో ఉన్న తిళ్లై నటరాజ స్వామి (Thillai Nataraja Swamy) గుడికి వెళ్లినట్లు తెలుస్తోంది. స్వామిని వారి దర్వనంతో పాటు అక్కడ కొన్ని ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ఇందులో భాగంగానే పెళ్లి కూతురులా మెడలో రెండు రకాల దండలు వేసుకుని దర్శనమిచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతుండగా.. శ్రీలీల భక్తికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Next Story