అట్లీ డైరెక్షన్‌లో శ్రీలీల సినిమా.. బాలీవుడ్ హీరోతో భారీ స్కెచ్!

by Chukka Sudharani |

అట్లీ డైరెక్షన్‌లో శ్రీలీల సినిమా.. బాలీవుడ్ హీరోతో భారీ స్కెచ్!
X

దిశ, సినిమా: తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ‘AA-22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తు్న్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు అట్లీ ఇప్పుడు మరో సినిమాను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ ఇందులో హీరోగా నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) చేతిలో.. స్పై యాక్షన్ చిత్రం ‘దురంధర్’ ఉంది. దీనికి యూరి ఫేం ఆదిత్యా ధర్ దర్శకత్వం వహిస్తుండగా.. దాదాపుగా రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

తదుపరి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్-3’ చేయతోన్నాడు. ఈ సినిమాల అనంతరం అట్లీ ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టునున్నాడట ఈ హీరో. భారీ బడ్జెట్‌తో ఈ స్పై యాక్షన్- కామెడీ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో బాబీ డియోల్, రాజ్‌పాల్ యాదవ్‌లు ప్రధాన పాత్రలో కనపించనున్నారని టాక్. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్‌గా టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. దాదాపు శ్రీలీల కన్ఫర్మ్ అయినట్లు బాలీవుడ్ మీడియాల నుంచి వార్తలు రావడంతో.. శ్రీలీలకు ఇది బంపర్ ఆఫరే అంటున్నారు నెటిజన్లు. Link

Next Story