- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్‌డే స్పెషల్‌గా శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘ఛాంపియన్’ గ్లింప్స్ రిలీజ్.. పాన్ ఇండియా లెవల్లో ఉందిగా
అలనాటి స్టార్ హీరో శ్రీకాంత్(Srikanth) తనయుడు రోషన్(Roshan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. దీనికి ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitham) దర్శకత్వం వహిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరో శ్రీకాంత్(Srikanth) తనయుడు రోషన్(Roshan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. దీనికి ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitham) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను.. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా మిక్కీ జె మేయర్(Mickey J Meyer) ఈ మూవీకు సంగీతం అందిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు (మార్చి 13న) హీరో రోషన్ బర్త్‌డే స్పెషల్(Birthday Special)గా ఛాంపియన్ గ్లింప్స్(Glimps) రిలీజ్ చేశారు. ఈ మేరకు అతనికి విష్ చేస్తూ.. ‘ఆట ఇప్పుడు మొదలవుతుంది.. ఛాంపియన్ వచ్చాడు అనే క్యాప్షన్ జోడించారు. అయితే ఈ సినిమాతో రోషన్‌లోని నటనను బయటకు తేవడానికి వైజయంతి బ్యానర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక గ్లింప్స్‌ను చూసినట్లయితే.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే సరికొత్త లుక్‌లో రోషన్ సూపర్‌గా ఉన్నాడు. కాగా గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. లవ్ స్టోరీతో పాటు ఫుట్ బాల్ గేమ్ థీమ్‌లో ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలా 38 సెకన్లు సాగిన గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాలిడ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
READ MORE ...
వారి ప్రేమ వేరే అబ్బా.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఇంట్రెస్టింగ్ ట్వీట్






