ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన శ్రీకాంత్ 'ఆబ్జెక్షన్ మై లార్డ్'.. ఆ తేదీ నుండి స్ట్రీమింగ్

by Pulgam srinivas |

శ్రీకాంత్ నటించిన 'ఆబ్జెక్షన్ మై లార్డ్' సిరీస్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన శ్రీకాంత్ ఆబ్జెక్షన్ మై లార్డ్.. ఆ తేదీ నుండి స్ట్రీమింగ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'ఆబ్జెక్షన్ మై లార్డ్ – నోటరీ పరశురామ్: చాప్టర్ 1'. ఇందులో ముఖేష్ రిషి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేందుకు సిద్ధమైంది. జీ5 ఈ వెబ్ సిరీస్‌ను జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్‌లో శ్రీకాంత్, ముఖేష్ రిషి ఒకరినొకరు తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుండగా, దిగువన మంటల్లో చిక్కుకున్న వ్యక్తి విజువల్ కథపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. న్యాయం, నేరం, కుట్రల నేపథ్యంలో సాగే కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందినట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించగా, డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించారు.




Next Story