- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఇమ్మార్టల్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే?
'ఇమ్మార్టల్'లోని రెండో సింగిల్ 'షీ ఈజ్ మై'ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ప్రస్తుతం 'ఇమ్మార్టల్' అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి పాటను విడుదల చేయగా, తాజాగా రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రంలోని రెండో సింగిల్ 'షీ ఈజ్ మై' పాటను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. అశోక్ కుమార్ ధనశేఖరన్, విజయ్ కుమార్ ధనశేఖరన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.






