- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srikanth Odela: మోహన్ బాబు గురించి ఇప్పటివాళ్లకి తెలియదు.. అది నేను చూపిస్తా
శ్రీకాంత్ ఓదెలా మాట్లాడుతూ... మోహన్ బాబు గారి గురించి ఈ తరం యువతకు పెద్దగా తెలియదు. నా సినిమా ద్వారా ఆయనేమిటో తెలుస్తుంది అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తిరుపతిలో నడుపుతున్న విశ్వవిద్యాలయం 34వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ దర్శకుడు మోహన్ బాబు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ... "నేను ప్రస్తుతం నాని హీరోగా 'ది ప్యారడైజ్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాను. అందులో మోహన్ బాబు గారు కూడా నటిస్తున్నారు.
ఆయన మా చిత్రంలో షికంజా మాలిక్ పాత్రలో కనిపించనున్నారు. చాలామంది మోహన్ బాబు గారు చాలా పద్ధతిగా ఉంటారు, ఆయన టైం సెన్స్ అద్భుతంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అలా ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయనేది నాకు ఆయనతో షూటింగ్ చేశాక అర్థమైంది. ఆయన చెప్పిన టైంకు షూటింగ్ కి వస్తారు. ఆయనకు షెడ్యూల్ ఉన్న రోజు అందరూ కూడా టైంకు వచ్చేస్తుంటారు. దానివల్ల షూటింగ్ చకచకా జరిగిపోతుంది, నాకు ఏమాత్రం ఇబ్బంది అనిపించదు.
ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మోహన్ బాబు గురించి పెద్దగా తెలియదు, మా చిత్రంలో ఆయన అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్ర ద్వారా ఈ తరం యువతకు కూడా ఆయన అంటే ఏమిటో క్లియర్గా అర్థం అవుతుంది" అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ బాల్యంలో చదువును నిర్లక్ష్యం చేసినట్లు, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల చదువు అనేది అన్ని రంగాల్లో ముఖ్యమని తెలుసుకున్నట్లు చెప్పారు. అలాగే అస్సలు చదువును నిర్లక్ష్యం చేయకూడదని చెప్పుకొచ్చారు.






