Srikalahasti: కన్నప్ప నుంచి ‘శ్రీకాళహస్తి’ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటోన్న వీడియో

by Chukka Sudharani |   (  Updated:2025-05-27 09:20:20  IST  )

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa) నుంచి తాజాగా ‘శ్రీకాళహస్తి’ (Srikalahasti) లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Srikalahasti: కన్నప్ప నుంచి ‘శ్రీకాళహస్తి’ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటోన్న వీడియో
X

దిశ, సినిమా: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa) నుంచి తాజాగా ‘శ్రీకాళహస్తి’ (Srikalahasti) లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘ఎల్లారా వినురారా కాళహస్తి గాధ.. శ్రీ కాళహస్తి గాధ.. కనులారా మనసారా కనిన జన్మ ధన్యమే కదా’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్తి సాంగ్ 28-05-2025 న రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. ‘శ్రీకాళహస్తి’ సాంగ్ కూడా ‘శివ శివ శంకర’ (Shiva Shiva Shankara) సాంగ్ రేంజ్‌లో హిట్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కాగా.. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohan Lal), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), అక్షయ్ కుమార్‌(Akshay Kumar)తో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు (Mohan Babu) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అంవుతోంది. అయితే.. ఇలాంటి సమయంలో ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌ను ఆఫీస్ బాయ్ రఘు అనే వ్యక్తి అపహరించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ ఉండగా.. మూవీ టీమ్ దీనిపై ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story