- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ హౌస్ అంటే అతనే
తాజాగా శ్రీదేవి మాట్లాడుతూ... తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ హౌస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: నాని నిర్మించిన కోర్టు మూవీ ద్వారా శ్రీదేవి, రోషన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో బ్యాండ్ మేళం అనే చిత్రం రూపొందింది. ఈ మూవీని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందు నుండే ఈ మూవీ హీరో, హీరోయిన్లు అయిన శ్రీదేవి, రోషన్ పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూకి బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ యాంకర్గా వ్యవహరించింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అరియానా... శ్రీదేవి మరియు రోషన్ ను తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ హౌస్ అంటే ఎవరు? అని ప్రశ్నించి అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అని మూడు ఆప్షన్లను ఇచ్చింది. శ్రీదేవి అందులో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పింది. ఎందుకు అని అడగ్గా.. ఎందుకంటే క్లారిటీగా చెప్పలేను. ఆయనను చూస్తుంటే ఒక సింహాన్ని చూసిన మాదిరి అనిపిస్తూ ఉంటుంది.
ఆయన ఫేస్ లయన్ లాగా ఉంటుంది. అందుకే ఆయన పవర్ హౌస్ అని శ్రీదేవి చెప్పింది. ఇక రోషన్ ను తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ హౌస్ అంటే ఎవరు అని ప్రశ్నించగా... ఆయన కూడా తారక్ అని సమాధానం చెప్పి, ఆయన యాక్టింగ్, డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన సినిమాలలో నాన్నకు ప్రేమతో మూవీ నాకు ఎంతగానో నచ్చుతుంది అని ఈ నటుడు సమాధానం ఇచ్చాడు. కోర్ట్ మూవీతో మంచి విజయాన్ని, గుర్తింపును సంపాదించుకున్న ఈ జంట 'బ్యాండ్ మేళం'తో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.






