- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారిన శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' విడుదల తేదీ
శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని ఫిబ్రవరి 27వ తేదీన కాకుండా మార్చి 6వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ విష్ణు తాజాగా మృత్యుంజయ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. సామజవరగమన ఫేమ్ రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు. గత కొద్ది కాలంగా వరుసగా కామెడీ ఎంటర్టైనర్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న శ్రీ విష్ణు కాస్త రూటు మార్చి ఈసారి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేశాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచారాలను కూడా నిర్వహించారు. అంతా ఓకే.. ఈ సినిమా విడుదల అవుతుంది అనుకునే లోపే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మార్చారు.
తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను ఫిబ్రవరి 27వ తేదీన కాకుండా మార్చి 6వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. శ్రీ విష్ణు తాజాగా విష్ణు విన్యాసం అనే చిత్రంలో హీరోగా నటించాడు. దానిని ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయనున్నారు. తన చిత్రానికి తానే పోటీ వస్తాడు అనే ఉద్దేశంతో కూడా మృత్యుంజయ్ మూవీ విడుదల తేదీని మార్చి ఉంటారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.






