- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి బరిలో మరో తెలుగు హీరో..ఇక ఫ్యాన్స్ కు జాతరే !
నారీ నారీ నడుమ మురారి సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తుండగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా చేస్తున్నారు. రామ్

దిశ, వెబ్ డెస్క్: 2026 సంక్రాంతి ఈ సారి మామూలుగా లేదు. అరడజన్ కు పైగా సినిమాలు ఈ సంక్రాంతికి వస్తున్నాయి. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు లాంటి బడా సినిమాలతో పాటు నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా వస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతి బరిలో యంగ్ హీరో శ్రీ విష్ణు పేరు కూడా తెరపైకి వచ్చింది. అదేంటి సడన్ గా శ్రీ విష్ణు పేరు వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? సొంత సినిమా ద్వారా శ్రీ విష్ణు రావడం లేదు కానీ, ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
నారీ నారీ నడుమ మురారి సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తుండగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా చేస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ లో శ్రీ విష్ణు కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా చిత్ర బృందం వెల్లడించింది. దీంతో సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కూడా ఉన్నాడని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఈ సినిమాలో శ్రీ విష్ణుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందట. త్వరలో అతని పాత్రకు సంబంధించిన పోస్టర్ కూడా రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.






