- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో శ్రీ విష్ణు మరో సినిమా.. షూటింగ్ కూడా స్టార్ట్
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు గతేడాది ‘సింగిల్’తో ప్రేక్షుకుల ముందుకు వచ్చి పెద్దగా మెప్పించలేక పోయాడు.

దిశ, సినిమా: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు గతేడాది ‘సింగిల్’తో ప్రేక్షుకుల ముందుకు వచ్చి పెద్దగా మెప్పించలేక పోయాడు. తర్వాత హిలేరియస్ జాయ్‌రైడ్ 'విష్ణు విన్యాసం'తో అలరించాడు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా నటించింది. రిలీజ్‌కు ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ కాగా.. కచ్చితంగా హిట్ సొంతం చేసుకుంటుంది అని భావించారు అంతా. ఇక పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఫిబ్రవరి 27న రిలీజైన ఈ సినిమా కూడా శ్రీ విష్ణుకి అంతగా కలిసి రాలేదు.
ఇలా వరుస పరాజయాలు చవిచూస్తున్న విష్ణు ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రామ్ అబ్బరాజుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామజవరగమన’ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లోనే సినిమా రాబోతుందంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా స్టార్ట్ అయింది. ఇది ఫుల్ ఫన్ ఎంటర్‌టైన్మెంట్‌గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.






