Sri Satya: ఏడో తరగతిలోనే లైంగిక వేధింపులు.. అందరూ చూసినా ఒక్కరూ పట్టించుకోలేదు

by Pulgam srinivas |   (  Updated:2026-03-20 14:47:53  IST  )

శ్రీ సత్య మాట్లాడుతూ... ఏడో తరగతి చదువుతున్న రోజుల్లోనే లైంగిక వేధింపులకు గురయ్యాను. కానీ ఆ రోజు నా పక్కన ఉన్న ఎవరూ కూడా దాన్ని ఆపలేకపోయారు.

Sri Satya: ఏడో తరగతిలోనే లైంగిక వేధింపులు.. అందరూ చూసినా ఒక్కరూ పట్టించుకోలేదు
X

దిశ, వెబ్ డెస్క్: సీరియల్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న శ్రీ సత్య ఆ తర్వాత 'బిగ్ బాస్ 6'లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో చాలామంది అభిమానులను మాత్రం సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా కూడా ఈమె ఓ ఇంటర్వ్యూలో అదే రకంగా మాట్లాడింది. దానితో ఈమె చెప్పిన విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షోలో పాల్గొన్న శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చాలా నిజాయితీగా పంచుకుంది.

ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిల మాదిరిగానే నేను కూడా అనేక సమస్యలను ఎదుర్కొన్నాను. నాకు ఇప్పటికీ కూడా తప్పుడు ఉద్దేశాలతో కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఎవరూ కూడా నేరుగా అలాంటి విషయాలను అడగకుండా పరోక్షంగా అడుగుతుంటారు. ఇప్పటికీ ఎన్నో సార్లు ఆడిషన్స్ పూర్తయ్యాక, ఫోటోషూట్ కూడా జరిగాక నన్ను సినిమా నుండి తీసేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలామంది అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడుతుంటారు.

చిన్న పిల్లలు ఎలాంటి వస్త్రాలను ధరిస్తున్నారు, వారిపై కూడా ఎందుకు లైంగిక దాడులు జరుగుతున్నాయి? నా జీవితంలో కూడా అలాంటి ఒక చేదు అనుభవం ఉంది. చిన్న వయస్సులో నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే ఒకడు నా నడుము గిల్లి వెళ్లిపోయాడు. ఆ సంఘటన జరిగిన సమయంలో ఎంతోమంది నా చుట్టూ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆపలేకపోయారు అని తన జీవితంలో చిన్న వయస్సులో జరిగిన చేదు సంఘటన గురించి చెబుతూ శ్రీ సత్య ఎమోషనల్ అయింది.

Next Story