Sri Satya: హాట్ స్టిల్స్‌తో గ్లామర్ షో చేస్తున్న సీరియల్ బ్యూటీ

by Pulgam srinivas |

పర్పుల్ డ్రెస్‌లో శ్రీ సత్య స్టైలిష్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

Sri Satya: హాట్ స్టిల్స్‌తో గ్లామర్ షో చేస్తున్న సీరియల్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో శ్రీ సత్య ఒకరు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగులో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.




ఈ షో అనంతరం శ్రీ సత్య సీరియల్స్‌లో పెద్దగా కనిపించకపోయినా, పలు టీవీ కార్యక్రమాల్లో సందడి చేస్తూ తన కెరీర్‌ను బిజీగా కొనసాగిస్తోంది. పేరుకు సీరియల్ నటి అయినప్పటికీ శ్రీ సత్య తన గ్లామర్ మరియు స్టైలిష్ లుక్స్‌తో సినిమా హీరోయిన్ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటోంది.




సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన ఫొటోషూట్ చిత్రాలను అభిమానులతో పంచుకుంటూ హల్ చల్ చేస్తుంది. ఆకర్షణగా తాజాగా శ్రీ సత్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పర్పుల్ కలర్ అల్ట్రా స్టైలిష్ డ్రెస్‌లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.




ఈ ఫోటోల్లో ఆమె స్టైలిష్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక చేతికి బ్రేస్‌లెట్, మరో చేతికి ఉంగరం ధరించి, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. అలాగే జుట్టును ముఖంపై పడేలా స్టైల్ చేయడంతో ఆమె లుక్ మరింత ఆకట్టుకునేలా కనిపించింది.




మొత్తంగా శ్రీ సత్య స్టైలిష్ అవతారంలో కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story