- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Sethupathi: విజయ్ సేతుపతి సినిమా రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ
by Chukka Sudharani |
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలపై ఆడియెన్స్ దృష్టి ఎక్కువగా ఉంటుంది.

X
దిశ, సినిమా: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చిత్రాలపై ఆడియెన్స్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే అందులో మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని అంతా ఫిక్స్ అవుతారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఏస్’. ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ నిర్మించారు. ఈ మూవీ తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి.శివ ప్రసాద్ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా.. ‘ఏస్’ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతాన్ని అందించగా.. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు.
Next Story






